Monday, August 17, 2020

ఫేస్‌బుక్ - విద్వేషంపై ఉదాసీనత

 విద్వేషంపై ఉదాసీనత

Aug 18, 2020, 04:13 IST

Rahul Gandhi demands JPC probe on Facebook - Sakshi

ఫేస్‌బుక్‌ తీరుతో దేశ ప్రజాస్వామ్యానికి ప్రమాదమన్న కాంగ్రెస్‌


సంయుక్త పార్లమెంటరీ కమిటీ విచారణకు డిమాండ్‌


అభ్యంతరకర అంశాలపై చర్యలు తీసుకుంటున్నామన్న ఫేస్‌బుక్‌


వేధింపులు, బెదిరింపులపై ఆ సంస్థ ఉన్నతాధికారిణి ఫిర్యాదు


న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌ అనుసరిస్తున్న వైఖరి కారణంగా దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని కాంగ్రెస్‌ ఆరోపించింది. ఈ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్‌ చేసింది. భారత్‌లోని బీజేపీకి చెందిన కొందరు నేతల విద్వేషపూరిత పోస్టులపై ఫేస్‌బుక్‌ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ అమెరికా ‘వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌’లో వచ్చిన కథనంపై ఇప్పటికే కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ స్పందించిన విషయం తెలిసిందే.


Advertisement


Powered By PLAYSTREAM


ఈ కథనంపై రాజకీయ దుమారం రేపడంతో సోమవారం ఫేస్‌బుక్‌ స్పందించింది. హింసను ప్రేరేపించే విద్వేష పూరిత అంశాలను అడ్డుకుంటున్నామని, రాజకీయ పార్టీలతో నిమిత్తం లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఇదే విధానాన్ని పాటిస్తున్నామని వివరణ ఇచ్చింది. ఇదిలా ఉండగా, తనను కొందరు ఆన్‌లైన్‌లో తీవ్రంగా బెదిరిస్తున్నారనీ, ప్రాణహాని ఉందంటూ ఆ సంస్థ ఉన్నతాధికారిణి


ఒకరు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 బీజేపీ నాయకుల విద్వేషపూరిత ప్రసంగాలను ఫేస్‌బుక్‌ చూసీచూడనట్లుగా వదిలేస్తోందంటూ ఇటీవల వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌లో ఒక కథనం వెలువడింది. మత విద్వేష వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలున్న తెలంగాణకు చెందిన ఒక బీజేపీ ఎమ్మెల్యేపై శాశ్వత నిషేధం విధించాలని తీసుకున్న నిర్ణయం భారత్‌లోని తమ ఉన్నతాధికారి జోక్యం కారణంగా ఆగిపోయిందని ఫేస్‌బుక్‌ ఉద్యోగులు కొందరు తెలిపారంటూ ఆ కథనంలో పేర్కొంది.


దీనిపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆదివారం స్పందించారు. ‘బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ భారత్‌లో ఫేస్‌బుక్, వాట్సాప్‌లను నియంత్రిస్తున్నాయి. వీటి ద్వారా తప్పుడు వార్తలను, విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నాయి. ఓటర్లను ప్రభావితం చేయాలని చూస్తున్నాయి’అని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఆ పార్టీ ప్రతినిధి సుప్రియా శ్రీనాతే సోమవారం మీడియాతో మాట్లాడుతూ..ప్రపంచంలో ప్రజాస్వామ్యం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటైన భారత్‌లో.. విద్వేషాన్ని ప్రేరేపించే వ్యక్తులు లేదా వేదికలను వదలకూడదు. ఫేస్‌బుక్‌ నిష్క్రియాపరత్వం ఫలితంగా దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ బలహీనపడుతుంది.


అభ్యంతరకర అంశాలు ఆ సంస్థ దృష్టికి వచ్చినప్పటికీ కొనసాగించడంతోపాటు ఎలాంటి చర్య తీసుకోకపోవడం హాస్యాస్పదం, ఘోరం’అని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) ఏర్పాటు చేయాలని కోరారు. ఇతర దేశాల్లో వదంతులు సృష్టించే, విద్వేషాలను పెంచే పోస్టులను తొలగించే ఫేస్‌బుక్‌.. భారత్‌లో మహిళలపై వేధింపులు, కొన్ని వర్గాలను, మతాలను లక్ష్యంగా చేసుకుని పెట్టే పోస్టులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఈ విధంగా ఒక్కో దేశానికి ఒక్కో  నిబంధనను ఫేస్‌బుక్‌ అమలు చేయడం సరికాదని తెలిపారు. ఫేస్‌బుక్‌తోపాటు వాట్సాప్‌లోనూ వదంతుల వ్యాప్తి, విద్వేషపూరిత సమాచారంపై  అదుపూ లేదన్నారు.


ఫేస్‌బుక్‌–బీజేపీ కుమ్మక్కు: సీపీఎం

విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన బీజేపీ నేతలపై ఫేస్‌బుక్‌ ఉద్దేశపూర్వకంగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ వాల్‌స్ట్రీట్‌ కథనంలో వచ్చిన ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని సీపీఎం డిమాండ్‌ చేసింది. అధికార పార్టీ నేతలకు ఫేస్‌బుక్‌లో పెట్టుబడులున్నాయనీ, కేంద్రంతో ఆ సంస్థ కుమ్మక్కయిందని సీపీఎం పొలిట్‌ బ్యూరో ఆరోపించింది. ఈ వ్యవహారంపై వెంటనే జేపీసీ  ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేసింది.


నాకు ప్రాణహాని ఉంది: ఫేస్‌బుక్‌ అధికారిణి

తనకు ప్రాణహాని ఉందని, చంపుతామని బెదిరిస్తూ కొందరు ఆన్‌లైన్‌లో పోస్టులు పెడుతున్నారంటూ ఫేస్‌బుక్‌ సంస్థ సౌత్‌ అండ్‌ సెంట్రల్‌ ఏసియా పబ్లిక్‌ పాలసీ డైరెక్టర్‌ అంఖి దాస్‌ ఫిర్యాదు చేశారు. ఫేస్‌బుక్‌ వ్యవహారంపై ఒకపక్క రాజకీయ దుమారం చెలరేగుతుండగా ఆదివారం ఆమె ఢిల్లీ పోలీసులను ఆశ్రయించారు.


‘నా జీవితాన్ని నాశనం చేస్తామని, నన్ను చంపుతామంటూ ఆన్‌లైన్‌లో నా ఫొటో పెట్టి మరీ బెదిరిస్తున్నారు. వార్తా కథనాన్ని సాకుగా చూపుతూ నా ప్రతిష్టను దెబ్బతీసేలా, నా వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆన్‌లైన్‌ ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతున్నారు. వీటి కారణంగా నాతోపాటు నా కుటుంబసభ్యుల భద్రత ప్రమాదంలో పడింది’అని ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, దర్యాప్తు బాధ్యతలను సైబర్‌ విభాగానికి అప్పగించినట్లు ఢిల్లీ పోలీస్‌ విభాగం అదనపు పీఆర్‌వో అనిల్‌ మిట్టల్‌ తెలిపారు.


మరింత చేయాల్సి ఉంది: ఫేస్‌బుక్‌

వాల్‌స్ట్రీట్‌ కథనంపై చెలరేగిన రాజకీయ దుమారం నేపథ్యంలో ఫేస్‌బుక్‌ ప్రతినిధి స్పందించారు. ‘విద్వేష ప్రసంగాలను, హింసను ప్రేరేపించే అంశాలను మేం అడ్డుకుంటున్నాం. ఏ రాజకీయ పార్టీ లేదా నేతతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాం. ఈ విషయంలో చేయాల్సింది ఇంకా ఉందని మాకు తెలుసు. ఈ ప్రక్రియ నిష్పక్షపాతంగా, కచ్చితత్వంతో ఉండేలా  ఆడిట్‌ చేపట్టాం. ఇది కొనసాగుతుంది’అని తెలిపారు.



డెమోక్రసీ ‘నాల్గవ స్తంభం’లో పగుళ్లు!

Aug 18, 2020, 04:10 IST

We Are Losing The Freedom Of The Press In India - Sakshi

పత్రికా స్వేచ్ఛ అనేది వ్యాపార స్వేచ్ఛలో భాగమైపోవడమే అత్యంత విస్మయకరం, విచా రకరం. పత్రిక అనేది ఒక వ్యాపారం కానప్పుడే అది స్వేచ్ఛగా ఉన్నట్టు లెక్క. అందుకే అది వ్యాపారానికి దూరంగా ఉండాలి. – కారల్‌ మార్క్స్‌  (లిటరేచర్‌ అండ్‌ ఆర్ట్స్‌) 



అనుమాన పిశాచమనే నీడలో హేతువు, రుజువు, కారణం నిలవవు, ఓడిపోతాయి. న్యాయం చచ్చిపోతుంది. అలాగే కొందరు జర్నలిస్టులు కూడా తాము ఏదో ఎదిగిపోవాలన్న తొందరలో అర్థసత్యాలతో ఏపగింపు కల్గిస్తూ అవే అంతిమ సత్యాలుగా పాఠకులపై రుద్దేస్తూ తమ స్వేచ్ఛను దుర్వినియోగపరచుకుంటారు. ఈ తెచ్చిపెట్టుకున్న దురద పనికిమాలిన చిల్లర మల్లర చెత్త పత్రికలకు వర్తిస్తుందే గానీ ఉత్తమ ప్రమాణాలతో నడిచే గొప్ప పత్రికలకు వర్తించదు. దేన్ని బడితే దాన్ని, ఎవరు ఏది చెబితే దాన్ని నమ్మేవారు మసాలా కబుర్లలో ఆనందం పొందే బాపతు మాత్రమే, ఏది నిజమో, ఏది కట్టుకథో తేల్చుకోలేని వారు మాత్రమే తాత్కాలిక ఆనందానికి లోనవుతారు. కానీ వ్యక్తుల వ్యక్తిత్వాలను నర్మగర్భంగా, ముసుగువేసి నాశనం చేయడానికి అత్యుక్తులు రాసి సెన్సేషనలిజం ద్వారా సర్క్యులేషన్‌ పెంచుకునే ధోరణి– ఉత్తమ ప్రమాణాలు గల పత్రికలకు పడదు. పచ్చి అబద్ధాలను ఎదుర్కో వడమూ ఆ క్రమంలో కష్టసాధ్యమే. అందుకే ఉత్తమ ప్రమాణాలు గల పత్రికల సంఖ్య తక్కువగా ఉంటుంది. ఇదే క్షమించదగిన జర్నలిజా నికి, క్షమార్హంకాని జర్నలిజానికి మధ్య ఉన్న తేడా. – జస్టిస్‌ వి.ఆర్‌. కృష్ణయ్యర్‌ (ఫ్రమ్‌ బెంచ్‌ టు ది బార్‌ పేజీ. 210)


ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం (టెక్నాలజీ) మానవాళికి ఎన్ని రకాల అనంతమైన అవకాశాలను ప్రసాదించిందో అంతకన్నా మించిన అనర్థాలను కూడా బలవంతంగా రుద్దుతోంది. యాప్‌లు, వాట్సాప్‌లు, లింకులు, వెబ్‌ లింకులు, మొబైల్స్, సూట్‌ కేసులో ఇమిడిపోయే కూపీ (ట్రాకింగ్‌) వ్యవస్థలూ, ఫేస్‌ బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లు (పాత టెలిగ్రామ్‌ భాషను అప్పటికప్పుడు ఆధునికంగా వండివార్చే, బాజా సాధనం) ఇలా సవాలక్ష ముమ్మరిస్తున్న దశలో ఉన్నాం. జుకర్‌ బర్గ్‌ రంగంలోకి వచ్చి ఫేస్‌ బుక్‌ అనే కూపీ వ్యవస్థను నర్మగర్భంగా రంగంలోకి  దించి దేశీయ సాంకేతిక, ఆర్థిక వ్యవస్థలను దేశాల ప్రయోజనాలకు విరు ద్ధంగా దేశీయ ప్రజలే ప్రయోగించేలా చేశాడు. ఆ మాటకొస్తే ఒకప్పుడు చైనీయులపైన నల్లమందు చల్లి, నల్లమందు భాయిలుగా బ్రిటిష్‌ వాడు ప్రచారం చేసినట్లే జుకర్‌బర్గ్‌ కూడా ఫేస్‌బుక్‌ ద్వారా భారతీయుల వ్యక్తిగత ఫోన్ల సమాచారాన్ని కోట్ల సంఖ్యలో ఫేస్‌ బుక్‌లో నమోదు చేసి అమెరికా, బ్రిటన్‌ మాళిగల్లో నిర్లిప్తంచేసి పెట్టాడు. అలా అని బీజేపీ పాలకులు జుకర్‌బర్గ్‌ ఫేస్‌బుక్‌ మనకే ఉపయోగిస్తుందని మురిసిపోయే సమయానికి మన పాలకుల గుట్టు మట్టుల్ని కూడా ఫేస్‌బుక్‌లో నిక్షిప్తం చేసేసరికి పాలకులు లబోదిబో మంటున్నారు. ఈ బాగోతం కాలిఫోర్నియాలో మన ప్రధాని హుషా రుగా జుకర్‌బర్గ్‌ను కలుసుకుని కరచాలనం చేసినంత సేపు పట్టలేదు.


ఇప్పుడు బీజేపీ వారు జుకర్‌బర్గ్‌ బీజేపీ రహస్యాలను ప్రైవేట్‌ వ్యాపార ప్రయోజనాల్లో భాగంగా ఫేస్‌బుక్‌ ద్వారా బట్టబయలు చేస్తున్న దశలో ఫేస్‌బుక్‌పై చర్యలు తీసుకోవాలని గగ్గోలు పెడు తున్నారు. మనం చైనాపై ‘గుర్రు’తో డజన్లకొద్దీ టిక్‌ టాక్‌లను, అప్పో లను నిషేధించినట్లు ప్రకటించుకున్నా అమెరికాతో మనకు పైన వేసు కున్న లింకుల వల్ల జుకర్‌బర్గ్‌ను వదిలించుకోలేము. అమెరికాలో జూకర్‌బర్గ్‌ బంధించి ఉంచిన మన ఫోన్‌ నంబర్లనూ విడుదల చేయించుకోలేని దుస్థితి ఈ సాంకేతిక ఉచ్చు మనచుట్టూ బిగియడానికి కారణం.. మన  సర్వర్ల ‘బిస’ అంతా అమెరికాలోనే ఉండటం! ఆంధ్ర ప్రదేశ్‌లో టెక్నాలజీ మాయ చాటున కొన్ని తొత్తు పత్రికలు కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్నీ, అటు రాష్ట్ర న్యాయ వ్యవస్థనూ కూడా అబద్ధాల అల్లికతో అభాసుపాలు చేయడానికి సంకల్పించి తప్పుడు కథనాలకు తెరలేపుతున్నాయి. న్యాయవ్యవస్థకూ చట్టబద్ధంగా ప్రజలెన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వానికీ మధ్య గండికొట్టి, అడుగువూడిన పాత పాలకులకు ప్రాణప్రతిష్ట చేయాలన్న తాపత్రయంకొద్దీ ‘న్యాయదేవతపై రాష్ట్ర ప్రభుత్వం నిఘా’ అంటూ అశరీరవాణి కథనాలు అల్లుతోంది: ఒక్క దానికీ రుజువులు లేవు.


పైగా రాష్ట్ర హైకోర్టు పేరును దుర్వినియోగపరుస్తూ, అలాంటి అలవాటులోనే ఉన్న ఆ ‘కెప్ట్‌ ప్రెస్‌’ అల్లిన కథనం అంతా ఆధునిక టెక్నాలజీ మెలకువలన్నింటినీ దుర్వినియోగం చేసి, ఆ కథనానికి తానే కర్త, కర్మ, క్రియగా మారిన మాస్టర్‌ అల్లిక అది. ఆ పత్రిక అల్లికల్లోని అంశాలు స్థూలంగా: ‘న్యాయమూర్తుల ఫోన్లు ట్యాప్‌? వెబ్‌లింక్‌ ద్వారా మొబైల్‌పై వల; వాట్సాప్‌ సందేశాలపైన నియంత్రణ, చదవక ముందే రీడింగ్‌మోడ్‌ లోకి, మాటల్లో అస్పష్టత, సమస్యలపై సాంకేతిక నిపుణులతో పరీక్ష, నెట్‌వర్క్‌ మొబైల్‌ మాత్రం బాగుందని నిర్ధారణ– అయినా అంతు చిక్కని ఇబ్బందులు అయినా నిఘాయే కారణమని అనుమానం, సూట్‌కేసులో ఇమిడిపోయే ట్రాకింగ్‌ వ్యవస్థ’ వల్ల ‘ఆధునిక టెక్నాలజీతో ఈ పనులన్నీ అత్యంత సులభమని’ ఆ కథనం సారాంశం. ఆ మొత్తం కథనం అంతా ఆధారపడింది వాస్తవాలపైన కాదు, పూర్తిగా ‘సొంత డబ్బా’పైననే! ‘న్యాయాన్ని అమ్మేవాడూ, దోవలు దోచేవాడూ ఒకటే’నన్న జగమెరిగిన మన తెలుగు సామెత. ఆ మాటకొస్తే అబద్ధం అంటేనే అతుకులమూట అనీ, అల్లిన కథనం దాచినా దాగని సత్యమనీ ప్రతి ఒక్కరికీ అర్థమవుతుంది. నిజానికి ‘న్యాయదేవతపై నిఘా’ వేసే తెలివితేటలు గాడితప్పి వ్యవహరిస్తున్న నడమంత్రపు పాత్రికేయులకు తప్ప వృత్తి ధర్మాన్ని, ప్రమాణాలను పాటించే వారికి ఉండజాలవు.


రాష్ట్ర రాజకీయ క్షేత్రంలో వైఎస్‌ జగన్‌ తనకు మించిన దీటైన పోటాపోటీతో తలపడి ‘ఢీ’కొనగల సత్తా ఉన్నవాడని భావించినందునే లోలోన టీడీపీ అధినేత చంద్రబాబు కుమిలిపోయాడు. అందుకే తప్పుడు ఆరోపణల పైన కుట్ర ద్వారా 16 మాసాలపాటు జైలుపాలు చేశాడని లోకానికి తెలిసి పోయింది. అయినా గత ఆరేళ్లకుపైగా సీబీఐ స్పెషల్‌ కోర్టులూ ఎంతసేపు ‘ఏవి మీ ఆధారాలు’ అని నిరంతరం ప్రశ్నిస్తూ ఉన్నా ఈ రోజుదాకా జగన్‌పై కేసులు అలా కొనసాగడం రాజ్య వ్యవస్థలో, న్యాయ వ్యవస్థల్లో చెండితనానికి నిదర్శనం కాదా? అంతేగాదు, చివరికి ‘ఆదాని శాసిస్తాడు/మోదీ పాటిస్తాడు/ జగన్‌ జైలుకు, భార్య భారతి ముఖ్యమంత్రి కుర్చీపైకి’ అనేంతగా పాత్రికేయ అజ్ఞాని బరి తెగించడాన్ని ఇతరులే కాదు, న్యాయ వ్యవస్థ కూడా సహించరానిది. దేశంలో న్యాయవ్యవస్థ పనితీరును గమని స్తున్న వారికి గత 70 ఏళ్లలో మన రాజ్యాంగ వ్యవస్థ, ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడకు ‘నాలుగు స్తంభాల’లో ఒకటైన పత్రికా వ్యవస్థతో పాటు మిగతా మూడు వ్యవస్థలు కూడా క్రమక్రమంగా ఎలా బీటలిచ్చి పోతు న్నాయో గమనించాల్సిన పరిణామం.


దీనికి కారణం– ఈ రాజ్యాంగ వ్యవస్థలేవీ రాజ్యాంగం నిర్దేశిం చిన మౌలిక లక్ష్యాలకు కట్టుబడకుండా గాడితప్పి నడుచుకొంటు న్నాయి. బహుశా అందుకనే సు్రçపసిద్ధ సుప్రీంకోర్టు మాజీ న్యాయ మూర్తి జస్టిస్‌ వీఆర్‌ కృష్ణయ్య కొన్ని విషయాలను ఇలా బాహాటంగా చెప్పగలిగారు: ‘న్యాయమూర్తులుగా పదవీ స్వీకారం చేసే ముందు రాజ్యాంగ నిబంధనలను కాపాడతానని ప్రతిజ్ఞ చేస్తారు. ఈ ప్రతిజ్ఞకు అర్థం– రాజ్యాంగం నిర్దేశించిన సోషలిస్టు, సెక్యులర్, ప్రజాస్వామ్య రాజకీయాలను పాటిస్తానని. ఇదెలా సాధ్యం? న్యాయమూర్తులకు రాజకీయ సిద్ధాంత తాత్వికత అనివార్యం. న్యాయమూర్తుల నియా మకం రాజ్యాంగం ప్రకారం జరిగిందిగానీ రాజ్యాంగానికి అతీతంగా జరగలేదు గనుక ఈ సైద్ధాంతిక నిబద్ధత అనివార్యం. ఒక కోటీశ్వ రుడు– మురికివాడల్లో నివసించే పేదవాడి ముందు నిలబడి నాకు రాజకీయాలు లేవు అని చెబితే అతణ్ణి మీరు నమ్ముతారా? అలాగే ఒక కార్మిక సంఘం నాయకుడు తన పారిశ్రామిక యజమాని ముందు నిల బడి నాకు రాజకీయాలు లేవంటే అది ఒట్టి తొండిమాట. రాజకీయా లున్నంత మాత్రాన వ్యక్తి న్యూనతగా భావించుకోరాదు. ‘నాకు రాజ కీయం’ లేదని దాచటం నేరం. మనం మనసిచ్చి భోళాగా మాట్లా డదాం. ఇతర వృత్తులలో ఉన్నవారి మాదిరిగానే న్యాయమూర్తులకు కూడా రాజకీయాలుంటాయి. కానీ, న్యాయ ప్రక్రియ అనేది మాత్రం కులాలకు, వర్గాలకు, సమూహాలకు అతీతం’! 


అంతేగాదు, కోర్టు ధిక్కార నేరాధికారాన్ని కోర్టు సమర్థించు కోవాలంటే, జరగాల్సిన న్యాయాన్ని జరగనివ్వకుండా అడ్డుకునే ప్రయత్నంలో కోర్టు తన ‘ధిక్కార ప్రయోగా’న్ని సమర్థించడం సబబ వుతుందని జస్టిస్‌ బ్లాక్‌ (1943) నిర్ధారించాడు. అలాగే కోర్టు తీర్పును సదుద్దేశంతో విమర్శించే ఎవరినీ తప్పుబట్టరాదనీ, అలాంటి విమర్శ సామాన్యుడి హక్కు అనీ ప్రివీకౌన్సిల్‌లో ఏనాడో లార్డ్‌ అడ్కిన్‌ ప్రకటిం చాడు. అంతేగాదు, నిజం చెప్పాలంటే, వార్తా పత్రికల్లో వచ్చే విమ ర్శలవల్ల వృత్తి నైపుణ్యంగల ఏ న్యాయమూర్తీ ప్రభావితుడు కాడని క్వీన్స్‌ కౌన్సిల్‌ సీనియర్‌ సభ్యుడు, సుప్రసిద్ధ న్యాయమూర్తి లార్డ్‌ డెన్నింగ్‌ స్పష్టం చేశాడు. మీడియాలో వచ్చే విమర్శలకు ఏ న్యాయ మూర్తీ ప్రభావితం కాకనక్కర్లేదనీ, వాటిని వృత్తిరీత్యా వచ్చే ఇబ్బందు లుగానే భావించి న్యాయమూర్తులు కూడా ప్రజల విమర్శను శిరసా వహించడం ధర్మమని లార్డ్‌ సాల్మన్‌ ప్రకటించాడు. అన్నింటికన్నా ‘కోర్టు ధిక్కార నేరం’ అనే ఆరోపణల గురించి లార్డ్‌ డెన్నింగ్‌ ఒక శిలా శాసనంగానే లభించిన పరిపక్వమైన వాక్యాలను ప్రపంచ న్యాయ శాస్త్రవేత్తలు తరచుగా పేర్కొనడాన్ని మనం మరచిపోరాదు. 


‘ఈ కోర్టు ధిక్కారమనే మన అధికారాన్ని మన న్యాయమూర్తుల సొంత గౌరవాన్ని ప్రదర్శించుకోవడానికి ఉపయోగించరాదు. స్పష్ట మైన సాక్ష్యంమీదనే ధిక్కార నేరం మోపాలి. అంతేగానీ మనను విమ ర్శించే వారిని అణచడం కోసం ఈ అధికారాన్ని వినియోగించరాదు. మనం విమర్శకు భయపడరాదు, విమర్శను వ్యతిరేకించరాదు. కానీ అంతకన్నా మనం కోల్పోయే అత్యంత ముఖ్యమైన ప్రాణప్రదమైన స్వేచ్ఛ ఒకటుంది– అదే భావప్రకటనా స్వేచ్ఛ. ప్రజాప్రయోజనాలకు సంబంధించిన విషయాలపైన సరసమైన వ్యాఖ్య, భోళా విమర్శ చేసే హక్కు పార్లమెంటులోనూ, బయటా, పత్రికల్లోనూ, టీవీలలోనూ పౌరులకు ఉంది. మా ప్రవర్తనే అంతిమ సాక్ష్యంగా నిలబడాలి. అంతే గానీ, చుట్టూ చెడు జరుగుతుంటే మౌనంగా ఉండిపోవటం మార్గం కాదు’ అలా అని, పత్రికలు తమ సర్క్యులేషన్‌ పెంచుకోవడానికి అవధులు లేని స్వేచ్ఛతో ఇతరులపై తప్పుడు ఆరోపణలు, నిందలు వేయటానికి పూనుకోవటం భావ స్వేచ్ఛను దుర్వినియోగం చేయడమే నని డెన్నింగ్‌ ప్రకటించాడు. అందుకేనేమో క్యూబా విప్లవ నేత ఫిడెల్‌ క్యాస్ట్రో అత్యంత స్పష్టంగా హెచ్చరించిపోయాడు– ‘నా ఒక్కడివల్లే, దేశం మారిపోతుందా? అనుకునే ఏ ఒక్కడివల్లా దేశానికి ప్రయోజనం లేదు’ అని!!



వ్యాసకర్త: ఏబీకే ప్రసాద్‌





సుప్రీంకోర్టు ధిక్కారం కేసులో ప్రశాంత్‌ భూషణ్‌ దోషే

 సుప్రీంకోర్టు ధిక్కారం కేసులో ప్రశాంత్‌ భూషణ్‌ దోషే

Aug 15, 2020, 01:20 IST

Prashant Bhushan guilty of contempt for tweets against judiciary - Sakshi

దేశ గౌరవాన్నే దెబ్బ తీశారన్న సుప్రీంకోర్టు

20న శిక్ష ఖరారు

న్యూఢిల్లీ: న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌కి సుప్రీం కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సుప్రీంకోర్టు, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే ప్రతిష్టకు భంగం కలిగేలా ట్వీట్లు చేసినందుకు అత్యున్నత న్యాయస్థానం ఆయనను దోషిగా తేలుస్తూ శుక్రవారం తీర్పు చెప్పింది. న్యాయవ్యవస్థపైనే ప్రశాంత్‌ భూషణ్‌ వదంతులు వ్యాప్తి చేయడానికి ప్రయత్నించారని అవన్నీ దేశ గౌరవాన్నే దెబ్బ తీసేలా ఉన్నాయని జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్, జస్టిస్‌ కృష్ణమురారిలతో కూడిన బెంచ్‌ వ్యాఖ్యానించింది. ఈ నెల 20న శిక్ష ఖరారు చేయనుంది. కోర్టు ధిక్కార కేసులో ఆయనకు 6నెలల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించే అవకాశాలున్నాయి. ఈ కేసు నుంచి ట్విట్టర్‌కి విముక్తి కల్పించింది.  

 ‘నిర్భయంగా, నిష్పక్షపాతంగా తీర్పులు చెప్పే న్యాయస్థానాలు ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి పెట్టని గోడలు’ అని   ధర్మాసనం అభివర్ణించింది. రాజ్యాంగానికి మూలస్తంభమైన అత్యున్నత న్యాయస్థానంపై ప్రశాంత్‌ భూషణ్‌ దాడికి దిగారని, అది కోర్టు ధిక్కారమేనని స్పష్టం చేసింది.

ప్రశాంత్‌ భూషణ్‌ ఏమని ట్వీట్‌ చేశారంటే ..?

 ప్రశాంత్‌ భూషణ్‌ జూన్‌ 27న చేసిన ట్వీట్‌లో దేశంలో అధికారికంగా ఎమర్జెన్సీ విధించకపోయినా ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని, గత ఆరేళ్లలో సుప్రీం కోర్టు పోషించిన పాత్ర, నలుగురు ప్రధాన న్యాయమూర్తులే దీనికి కారణమన్నారు. రెండో ట్వీట్‌లో ప్రధాన న్యాయమూర్తి బాబ్డే ఎలాంటి మాస్క్, హెల్మెట్‌ ధరించకుండా నాగపూర్‌లోని రాజ్‌భవన్‌లో బీజేపీ నేతకు చెందిన రూ.50 లక్షల బైక్‌ని నడుపుతున్నారని, లాక్‌డౌన్‌ అంటూ జనం సమస్యల్ని ప్రత్యక్షంగా విచారించడానికి నిరాకరిస్తూ హెల్మెట్‌ లేకుండా ప్రధాన న్యాయమూర్తి ఎలా బండి నడుపుతారంటూ ఆ ట్వీట్‌లో ప్రశ్నించారు.